Gas cylinder accident : వెస్ట్ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసేసమయానికే తీవ్ర నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంట్లో బాణా సంచా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
ఎందుకంటే ఇంట్లోని రెండు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఇంట్లో ఎప్పటి నుంచో బాణాసంచా నిల్వ ఉందని.. దానికి మంటలు అంటుకుని పేలుడు పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.