అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో , తన నటన అందంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి ప్రజెంట్ రూట్ మార్చింది. ఆఫర్ తగ్గడంతో హీరోయిన్‌లు ఇండస్ట్రీ మార్చడం, లేదా స్కిప్ షో చేయడం కామన్. ఇక్కడ కీర్తి కూడా అదే చేసింది బిగినింగ్‌లో సాఫ్ట్ క్యారెక్టర్స్.. పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పడు టోటల్‌గా చేంజ్ అయింది. ఉహించని విధంగా స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. ముఖ్యంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తు రచ్చ చేస్తోంది. ఇక రీసెంట్‌గా సౌత్ హీరోయిన్ లు బాలీవుడ్‌లో క్రెజీ ఆఫర్‌లు అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లోకి కీర్తి కూడా జయిన్ అయ్యింది.
Also Read:Tamanna : మరో ఐటమ్ సాంగ్‌తో రాబోతున్న తమన్నా !
కాని అక్కడ మొదటి చిత్రం తోనే అపజయం ఎదురుకున్న ఈ చిన్నది ప్రస్తుతం ‘అక్క’, ‘రివాల్వర్ రీటా’ లాంటి వైవిధ్యమైన కథలతో బిజీగా గడుపుతోంది. అయితే హిందీలో మరో మూవీ కోసం చర్చలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్‌తో కీర్తి జోడీ కట్టనున్నట్లు సమాచారం. మంచి క్రేజ్ ఉన్న వీరిద్దరి కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తోందట చిత్రబృందం. మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు కీర్తి సన్నిహిత వర్గాలు తెలిపాయి.