ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్‌లను అశ్వని కుమార్ పెవిలియన్ పంపాడు.
ఓవరాల్‌గా అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్వని కుమార్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ టాప్‌లో ఉన్నాడు. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన జోసెఫ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రూ టై(5/17), షోయబ్ అక్తర్ (4/11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్వని కుమార్ (4/24), కేవన్ కూపర్ (4/26), డేవిడ్ వైస్ (4/33) 4 వికెట్స్ పడగొట్టారు. మరో రికార్డు కూడా అశ్వని ఖాతాలో చేరింది. అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 10వ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇషాంత్ శర్మ, షేన్ హర్వూడ్, అమిత్ సింగ్, విల్కిన్ మోటా, ఛార్ల్, టీ సుధింద్రా, అల్జారీ జోసెఫ్, అలి ముర్తాజా,, మతీష పతీరణలు ఉన్నారు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చెన్నై కోచ్ ఏమన్నాడంటే?
అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా:
# 6/12 – అల్జారి జోసెఫ్ (ముంబై) vs హైదరాబాద్, 2019
# 5/17 – ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్) vs పూణే, 2017
# 4/11 – షోయబ్ అక్తర్ (కోల్‌కతా) vs డెక్కన్ చార్జెస్, 2008
# 4/24 – అశ్వని కుమార్ (ముంబై) vs కోల్‌కతా, 2025
# 4/26 – కెవాన్ కూపర్ (రాజస్థాన్) vs పంజాబ్, 2012
# 4/33 – డేవిడ్ వైస్ (బెంగళూరు) vs ముంబై, 2015