Health Tips: మానవుని శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. వీక్ గా ఉన్నప్పుడు కానీ.. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు గానీ డాక్టర్లు ప్రొటీన్లు ఉండే పదార్థాలు వాడాలని సూచిస్తారు. శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం కావడం వల్ల శరీరంలో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. దీనితో పాటుగా ఇది హార్మోన్లను నియంత్రిస్తుంది. అలాగే న్యూరోట్రాన్స్మిటర్లు, రోగనిరోధక పనితీరుకు కూడా చాలా అవసరమవుతుంది. అయితే ప్రొటీన్లు ఎక్కువగా వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంకు తీవ్ర నష్టం చేకూరింది..
ముఖ్యంగా ప్రొటీన్లు ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అలాంటి ఆహారం తిన్నప్పుడు స్వల్పంగా అయితే బరువు తగ్గుతారు.. కానీ భవిష్యత్ లో మళ్లీ బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే శరీరంలో కొవ్వువలే ఎక్కువ ప్రోటీన్ నిల్వ ఉండటంతో.. అమైనో ఆమ్లాల పరిణామం పెరుగుతుంది. దీంతో మళ్లీ బరువు పెరిగేందుకు ఛాన్స్ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జంతువులతో వచ్చే ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించినప్పుడు వాసన మరింత ఎక్కువవుతుంది. ఫైబర్ లేని పాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంటే మీకు విరేచనాల సమస్య వచ్చే అవకాశం ఉంది.
Read Also: Long Covid-19: షుగర్ ఔషధంతో లాంగ్ కోవిడ్‌కు చెక్.. అధ్యయనంలో వెల్లడి..
అయితే ఒక వ్యక్తి వారి వయస్సు, లింగం, శరీర బరువు, శరీర కూర్పు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి శారీరక శ్రమలో పాల్గొనకపోతే.. వారు వారి శరీర బరువులో కిలోగ్రాముకు కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మీరు రోజులో 1 గంట పాటు వ్యాయామాలు చేస్తే మీ శరీరంలోని 3 కిలోలకు 1.2 నుంచి 1.7 గ్రాముల ప్రోటీన్ ను తీసుకోవాలంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.