వేసవి కాలం వచ్చేసింది. మే నెల ఇంకా రానేలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో ఎంత జాగ్రతలు తీసుకున్న మనల్ని మనం కాపాడుకోవడం కొంచెం కష్టమని చెప్పాలి. అందుకే ఈ వేసవిలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రతగా ఉండాలి అని డాక్టర్‌లు చెబుతున్నారు. ఇక మొక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చెట్ల ను ఇష్టపడనివారంటూ ఉండరు. చాలా మంది ఇండ్లల్లో మొక్కలు బాగా పెంచుతారు. చెప్పాలంటే ఇంకొంత మంది ప్రాణంగా కాపాడుకుంటారు. ఇంట్లో…
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
దీపావళి రోజు ఆరోగ్యంతో పాటు కంటి భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దీపావళి సందర్భంగా కాలుష్యం స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. ఆ కాలుష్యం ఇళ్లలోకి కూడా చేరి కళ్లను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కళ్ళను రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా పటాకుల పొగ, కాలుష్యం కారణంగా కంటి చూపు కోల్పోయిన చాలా మంది ఉంటారు.
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు.
పండుగ వచ్చిదంటే చాలు రకరకాల తినుబండరాలు, వంటకాలు చేస్తారు. అందుకోసం ఎక్కువగా నూనెను వాడుతారు. అయితే.. వంటలు చేసేందుకు పాన్‌లలో అధికంగా నూనెను పోస్తుంటారు. అన్నీ వంటకాలు చేయగా మిగిలిన నూనెను మళ్లీ వేరే వంటకాల కోసం దాచిపెడతారు. అలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే.. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం.. దాని పర్యావసానల వల్ల ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. వాడిన…
'హలో... నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్‌ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి...' అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్‌కు కాల్‌లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న…
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బెడ్ మీద నుంచి లేవగానే.. ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఫాస్ట్‌గా బ్రష్ చేసి.. టీ, కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని.. టైమ్ లేదని టిఫిన్ తినడం మానేసి ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఉదయం మనం లేవగానే చేసే పనుల ప్రభావం.. ఆ రోజంతా ఉంటుంది. మన రోజు చికాకుగా మొదలు పెడితే.. ఆరోజంతా విసుగ్గానే ఉంటుంది. ప్రతి రోజూ ఇలాగే అలవాడు పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే…
ప్రొటీన్లు ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అలాంటి ఆహారం తిన్నప్పుడు స్వల్పంగా అయితే బరువు తగ్గుతారు. జంతువులతో వచ్చే ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
Be careful of ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీ.. అద్భుతాలు చేస్తోందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సరికొత్త సాంకేతికతలో కూడా కొన్ని లోటుపాట్లు బయటపడుతున్నాయి. అడిగిన సమాచారాన్ని లోపాలు లేకుండా ఇవ్వటంలో ఈ చాట్‌బాట్ తడబడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇదొక లోపం కాగా.. ఈ కృత్రిమ మేధతో షేర్ చేసుకునే మన పర్సనల్ డేటాకు ప్రైవసీ లేకపోవటం మరో లోపం.