బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,250 పెరిగి.. రూ.1, 25, 620 దగ్గర అమ్ముడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 పెరిగి రూ.1, 15, 150 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 940 పెరిగి.. రూ.94, 220 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
ఇక వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1, 55, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1, 70, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.1, 55, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు