Kiren Rijiju: 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా శనివారం ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Aadujeevitham: ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్న పృథ్వీరాజ్!
న్యాయవ్యవస్థపై బెదిరింపులకు దిగడం కాంగ్రెస్ కు అలవాటే అని, 1975లో ఎమర్జెన్సీ విధించడానికి ముందు కూడా ఆ పార్టీ నేతలు న్యాయవ్యవస్థ లక్ష్యంగా దాడి చేశారని, నిరాశతో మరిన్ని దాడులు చేస్తారని కిరణ్ రిజిజు అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని, కాంగ్రెస్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానిక ప్రయత్నిస్తుందని, మేము మౌనంగా ఉండబోమని ఆయన అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతూ.. మోదీ ఇంటి పేరు ఉన్న వాళ్లంతా దొంగలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు వేయగా సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు పడింది.
కాంగ్రెస్ నేత ఎమన్నారంటే..?
తమిళనాడులోని దిండిగల్ లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ విభాగం పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికందన్ మాట్లాడుతూ.. మార్చి 23న సూరత్ కోర్టు న్యాయమూర్తి మా నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించారు. వినండి జస్టిస్ హెచ్ వర్మ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ నాలుక నరికేస్తాం అని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.