IMD hopeful of normal monsoon in 2023: ఈ ఏడాది రుతుపవనాల గురించి కీలక విషయం చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). 2023లో దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది భారత్ లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఆశిస్తోంది. అయితే భారతదేశంలో రుతుపవన సీజన్ లో ఎల్-నినో ఏర్పడే అవకాశం ఉందని, ఇది వర్షాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది.
Stray Dogs Attack: కుక్కల దాడుల్లో అమాయకపు పిల్లలు దారుణంగా మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చాలా మంది మరణించారు. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీధికుక్కల దాడుల్లో 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. మహారాజ్‌గంజ్‌లోని శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు.
50 years of Project Tiger: ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో 2022 వరకు ఉన్న పులుల సంఖ్యను ప్రకటించారు. దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ పెద్దపులుల పరిరక్షణలో ముందుందని అన్నారు. ప్రకృతిని రక్షించడం భారతీయ సంస్కృతిలో భాగంమని, ప్రాజెక్ట్ టైగర్ విజయం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి, అదే సమయంలో ప్రపంచంలోని పులుల జనాభాలో…
Migrants missing after boat sinks off Tunisia: మంచి జీవితం కోసం యూరప్ వలస వెళ్తాం అనుకున్న వలసదారుల ఆశలు అవిరయ్యాయి. మధ్యదరా సముద్రంల ట్యూనీషియా తీరంలో పడవ మునిగిపోవడంతో 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి మధ్యదర సముద్రం మీదుగా ఇటలీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో ట్యూనీషియా తీరంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు బీజేపీ పెద్దలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య,…
Amul vs Nandini: కర్ణాటకలో ఎన్నికల ముంచుకొస్తున్న వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పాల వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్, జేడీయూ పార్టీలు అధికార బీజేపీని ఇరకాలంలో పడేశాయి. రాష్ట్రంలోకి గుజరాత్ డెయిరీ దిగ్గజం అమూల్ ఎంట్రీ ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలోని రైతులకు నష్టం చేకూరేలా నందిని మిల్క్ ను దెబ్బతీసేలా బీజేపీ చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి.
Covid-19: దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రోజూవారీ కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు 5 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,357 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 32,814 కి చేరుకుంది.
Mangoes On EMI: మొబైల్ ఫోన్లు, కార్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు ఈఎంఐల్లో కొనుగోలు చేయడం విన్నాం. కానీ మామిడి పండ్ల కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్ ఎప్పుడైనా విన్నారా..? అయితే ఓ సారి ఈ స్టోరిని చదవాల్సిందే. వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను టేస్ట్ చేయాలని చూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది మామిడికి
Maharashtra CM Eknath Shinde To Visit Ayodhya Today: మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అయోధ్యలో పర్యటించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి వెంట వేల సంఖ్యలో శివసైనికులు రానున్నారు.