Rise In Temperature: ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Read Also: Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు.. జాతీయ కార్యదర్శి పదవి?!
వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ ఇటీవల తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణం అవుతోంది. ఐఎండీ ప్రకారం, 1901 నుంచి రికార్డులను పరిశీలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వేసవి కాలంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు నమోదు అవుతుంటాయి. వీటి వల్ల మామిడితో పాటు ఇతర పంటలు దెబ్బతింటాయి.