Rare Earth Elements Reserve In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన మూలకాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు పరిశోధించగా అక్కడి నేలల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు వెల్లడించారు. అనంతపురంలోని వీటిని సైంటిస్టులు గుర్తించారు. మెడికల్ టెక్నాలజీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్‌తో సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు వివిధ పారిశ్రామిక అవసరాల్లో ఉపయోగించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈ) నిల్వలు వెలుగులోకి వచ్చాయి.
లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ మినరల్స్‌లో లాంతనమ్, సిరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, యిట్రియం, హాఫ్నియం, టాంటాలమ్, నియోబియం, జిర్కోనియం మరియు స్కాండియం ఉన్నాయి. అక్కడి నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు అత్యంత సంపన్నమైన లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (La, Ce, Pr, Nd, Y, Nb, Ta)లను కనుగొన్నట్లు ఎన్జీఆరై సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సుందర్ రాజు వెల్లడించారు.
Read Also: Death By Stray Dogs: ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల బీభత్సం.. ఐదేళ్ల బాలిక మృతి
స్కాండియం, యట్రియం మూలకాలు పిరియాడిక్ టేబుల్ లోని 15 రకాల లాంతనైడ్, ఆక్టినైడ్ సీరీస్ లను సూచించే విభాగానికి చెందినవి. ప్రస్తుతం మనం వాడే సెల్ ఫోన్లు, మెడికల్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఆటోమోటివ్, డిఫెన్స్ సెక్టార్లలో ఈ మూలకాలను వినియోగిస్తారు. వీటి తయారీలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం. శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడంలో ఈ రేర్ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ శాశ్వత అయస్కాంతాలను సెల్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్, విండ్ టర్బైన్లు, జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేక ఇతర ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
ప్రకాశించే గుణం, ఉత్ప్రేరక లక్షణాల కారణంగా ఆర్ఈఈలు అధికంగా ఉపయోగపడుతాయి. 2050 నాటికి యూరప్ కు ప్రస్తుత డిమాండ్ తో పోలస్తే 26 రెట్లు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం అవుతాయని అంచనా. డిజిటలైజేషన్ కారణంగా వీటి డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. SHORE (రిసోర్స్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం షాలో సబ్‌సర్ఫేస్ ఇమేజింగ్ ఆఫ్ ఇండియా) అనే ప్రాజెక్ట్ కింద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR-ఇండియా) జరిపిన అధ్యయనంలో ఈ ఎలిమెంట్స్ ఆవిష్కరించబడ్డాయి.