Ajit Pawar: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని ఆయన శనివారం అన్నారు. మోడీ గెలిచిన తర్వాత ప్రజాదరణ పొందారని, బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచిందని, 2019లో కూడా భారీ మెజారిటీతో గెలిచిందని ఇది ప్రధాని మోడీ మ్యాజిక్ కాకపోతే ఇంకేంటి..? అని ప్రశ్నించారు. ప్రధాని డిగ్రీపై ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సందర్భంలో అజిత్ పవార్ మాట్లాడుతూ..రాజకీయాల్లో విద్యతో సంబంధం లేదని అన్నారు. 2014,2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చింది మోడీ మ్యాజికే అని అన్నారు.
Read Also: Mosquito Liquid: విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
ఈవీఎం అవకతవకలు జరిగాయని తేలితే దేశంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడుతుందని, అలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసించరని అన్నారు. కొన్ని సార్లు కొందరు ఎన్నికల్లో ఓడిపోతారు, ఆ తరువాత ఈవీఎంలపై ఆరోపణలు చేస్తారు, కానీ ఇది ప్రజలు అసలైన ఆదేశం అని ఆయన అన్నారు. ఈవీఎంల్లో అవకతవకలు జరిగితే చత్తీస్‌గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉండేవి కావని ఆయన అన్నారు. దేశంలో ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.