Shivaji-Chinmayi : శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే..
Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే వెళ్తాయట!
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు సినిమా ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని సలహా ఇచ్చారు. సావిత్రి, సౌందర్య లాంటి వారు ఎంత నిండుగా ఉండేవారో గుర్తు చేస్తూ.. ఇప్పుడు రష్మిక కూడా చక్కగా బట్టలు వేసుకుంటుందని మెచ్చుకున్నారు. అయితే, గ్లామర్ పేరుతో హద్దులు మీరితే గౌరవం ఉండదని, ‘సామాన్లు’ కనిపించేలా బట్టలు వేసుకుంటే జనం నవ్వుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. స్త్రీ అంటే ప్రకృతి అని, పద్ధతిగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని శివాజీ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఎప్పటిలాగే ట్విట్టర్ (X) వేదికగా ఫైర్ అయ్యారు.
శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి ‘దరిద్రపు ముండ’ వంటి పదాలు వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. “మీరు మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు కానీ, హీరోయిన్లు మాత్రం పద్ధతిగా ఉండాలా? మీకు అంతగా భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉంటే.. మీరు కూడా దోతీలు, కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టెలు పెట్టుకుని తిరగండి” అంటూ స్పందించింది. షూటింగ్ సెట్స్‌లో మహిళలను ఇలాగేనా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాటల యుద్ధం ఎంత వరకు సాగుతుందో చూడాలి.
Telugu Actor Sivaji doles out unnecessary advice to Actresses using slurs like ‘Daridrapu Munda’ saying they need to wear Saris to cover their ‘Saamaan’ – a word incels use.
Actor Shivaji played a villain in a fantastic film and end up becoming the hero for incel boys.
The…
— Chinmayi Sripaada (@Chinmayi) December 23, 2025
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!