Amul vs Nandini: కర్ణాటకలో ఎన్నికల ముంచుకొస్తున్న వేళ సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పాల వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్, జేడీయూ పార్టీలు అధికార బీజేపీని ఇరకాలంలో పడేశాయి. రాష్ట్రంలోకి గుజరాత్ డెయిరీ దిగ్గజం అమూల్ ఎంట్రీ ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలోని రైతులకు నష్టం చేకూరేలా నందిని మిల్క్ ను దెబ్బతీసేలా బీజేపీ చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి.
READ ALSO: Mangoes On EMI: మామిడి పండ్లకు ఈఎంఐ ఆఫర్.. ఓ వ్యాపారి వినూత్న ఆలోచన
ఇదిలా ఉంటే తాజాగా బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ నందిని మిల్క్ కు మద్దతుగా నిలిచింది. కన్నడిగులు నిందిని పాల ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలని కోరింది. మన రైతులు ఉత్పత్తి చేసే కర్ణాటక నందిని పాలను చూసి మనం గర్విస్తున్నామని, దానిని ప్రోత్సహించాాలని, బెంగళూర్ లో పరిశుభ్రమైన, రుచికమైన టీ, కాఫీలు, అనేక చిరుతిండ్లకు నందిని మిల్క్ వెన్నెముకగా నిలుస్తోందని హోటల్స్ అసోసియేషన్ మద్దతు ఇచ్చింది.
రాష్ట్రంలో బలమైన డెయిరీ బ్రాండ్ అయిన నందిని మిల్క్ బ్రాండ్ ను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. అమూల్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని కన్నడిగులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కర్ణాటక మిల్స్ ఫెడరేషన్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ మధ్య విలీనానికి సంబంధించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సహకార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అమిత్ షా ఈ విషయంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కన్నడ రైతులకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. అమూల, నందినీ మిల్క్ దెబ్బతీయదని అన్నారు.