50 years of Project Tiger: దేశంలో పులుల సంఖ్యని ప్రకటించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 years of Project Tiger: ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో 2022 వరకు ఉన్న పులుల సంఖ్యను ప్రకటించారు. దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ పెద్దపులుల పరిరక్షణలో ముందుందని అన్నారు. ప్రకృతిని రక్షించడం భారతీయ సంస్కృతిలో భాగంమని, ప్రాజెక్ట్ టైగర్ విజయం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి, అదే సమయంలో ప్రపంచంలోని పులుల జనాభాలో 75% భారతదేశంలోనే ఉన్నాయని తెలిపారు.
ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% మాత్రమే ఉన్న భారతదేశం, ప్రపంచ వైవిధ్యంలో 8 శాతానికి దోహదం చేస్తోందని అన్నారు. దశాబ్ధాల క్రితం భారత్ లో చిరుతలు అంతరించపోయాయని, అయితే మేము వాటిని నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్ తీసుకువచ్చామని అన్నారు. దాదాపుగా 30,000 ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగులు సంఖ్యతో మనదేశం మొదటిస్థానంలో ఉందని ప్రధాని అన్నారు. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాల చాలా ముఖ్యమైన మైలురాయిని మనమందరం చూస్తున్నామని, భారతదేశం పులిని రక్షించడమే కాకుండా, అభివృద్ధి చెందడానికి అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను కూడా ఇచ్చిందని కొనియాడారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
Read Also: Tunisia: మునిగిపోయిన పడవ.. 20 మందికి పైగా వలసదారులు గల్లంతు..
కర్ణాటక చామనగర జిల్లాలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ప్రధాని మోడీ ఈ రోజు పర్యటించారు. అటవిలో 20 కిలోమీటర్ల మేర సఫారీ చేశారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన తొలి ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో పాటు తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించి ఏనుగులకు ఆహారం అందించారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్ల జ్ఞాపకార్థం అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్(ఐబీసీఏ)ని ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఇటీవల ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీ గురించి ప్రధాని ప్రస్తావించారు. ప్రకృతికి మరియు జీవులకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని మన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. మన గిరిజన సమాజ జీవితం, సంప్రదాయం నుంచి ఏదైనా నేర్చుకోవాలని విదేశీ ప్రముఖులను కోరారు. ఎలిఫెంట్ విస్పరర్ జంట బొమ్మన్, వల్లిని కలిసి ప్రధాని మోదీ ముచ్చటించారు.
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!