ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్‌కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ 2025 వార్షిక ఆర్డర్ అనాలసిస్ నివేదికలో కొన్ని ఆసక్తికర వివరాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం.. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కండోమ్‌లపై ఏకకాలంలో లక్ష రూపాయల ఖర్చు చేశారు. ఈ సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది.
అలాగే.. కొచ్చికి చెందిన ఒక వ్యక్తి ఏడాదిలో మొత్తం 368 సార్లు కరివేపాకు ఆర్డర్ చేశారు. బెంగళూరుకు చెందిన మరొక వినియోగదారుడు కేవలం రూ.10తో ప్రింటవుట్లు ఆర్డర్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నది.హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడళ్ల కోసం రూ.4.3 లక్షలు ఖర్చు చేశారు. ముంబయికి చెందిన ఒక వినియోగదారుడు రూ.15.16 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేశారని నివేదిక పేర్కోంది.
దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన వస్తువులలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు ఉన్నాయి. వినియోగదారులు ఎక్కువగా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆర్డర్లు పెట్టినట్లు ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది.