Covid-19: దేశంలో ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. రోజూవారీ కేసుల సంఖ్య వేలల్లో నమోదు అవుతున్నాయి. వరసగా కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు 5 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,357 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత రెండు రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 32,814 కి చేరుకుంది.
Read Also: Mangoes On EMI: మామిడి పండ్లకు ఈఎంఐ ఆఫర్.. ఓ వ్యాపారి వినూత్న ఆలోచన
గత 24 గంటల్లో 3,726 రికవరీ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం ఇప్పటివరకు కొలుకున్నవారి సంఖ్య 4,41,92,837కి చేరింది. రివకరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేట్ 3.39 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించారు.
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యాయి. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 కారణం అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హర్యానా, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు.