Honour killing: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమిస్తుందని కన్న తండ్రి కూతుర్ని చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రియుడిని కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మొరెనాలో జరిగింది. ఇద్దరు చనిపోయిన తర్వాత చంబల్ నదిలో ఇద్దరి మృతదేహాలను పారేశాడు. మొరేనా జిల్లా రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాణి(18), సమీప గ్రామం బలుపురాకు చెందిన రాధేశ్యామ్ తోమర్(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శివాణి తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
Earthquake: మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
Daaku Haseena: పంజాబ్ లో రూ. 8 కోట్ల దోపిడీ ఇటీవల కలకలం సృష్టించింది. డాకు హసీనాగా పేరొందిన మన్ దీప్ కౌర్, ఆమె భర్ జస్విందర్ సింగ్ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు.
Shiv Sena: మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంఎల్సీ మనీషా కయాండే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు
Kedarnath: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కేదార్నాథ్ వార్తల్లో నిలిచింది. ఓ పూజారి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఉత్తరాఖండ్ లో వెలిసి కేదార్నాథ్ దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపనంలో రూ. 125 కోట్ల కుంభకోణం జరిగిందని
Devendra Fadnavis: భారతదేశంలోని ముస్లింలు ఎవరూ ఔరంగజేబ్ కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలు ఎవరూ కూడా మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా గుర్తించరని మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగబాద్ లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్
North Korea: ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన గూఢాచార శాటిలైట్ విఫలం అయింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. అయితే ఈ ప్రయోగం విఫలమై, రాకెట్ సముద్రంలో కుప్పకూలిపోయింది. తన మొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని మే 31న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. సరిహద్దు దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ దేశం ప్రయోగాన్ని నిర్వహించింది.