North Korea: ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన గూఢాచార శాటిలైట్ విఫలం అయింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. అయితే ఈ ప్రయోగం విఫలమై, రాకెట్ సముద్రంలో కుప్పకూలిపోయింది. తన మొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని మే 31న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. సరిహద్దు దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ దేశం ప్రయోగాన్ని నిర్వహించింది.
Read Also: Sreeleela : ఘాటు పోజులతో హీటేక్కిస్తున్న శ్రీలీలా
ఇదిలా ఉంటే ఉత్తర కొరియా అధికారిక పార్టీ అత్యున్నత సమావేశంలో ప్రయోగం విఫలం కావడానికి అధికారులే బాధ్యులను చేసింది. ఈ ప్రయోగం విఫలం కావడానికి అధికారులే కారణం అని నిందించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రయోగం విఫలం అయినందుకు విచారణ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. నార్త్ కొరియా నిర్వహించిన ఈ ప్రయోగాన్ని అమెరికా, సౌత్ కొరియా, జపాన్ దేశాలు ఖండించాయి. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను ఉపయోగించి ఎలాంటి పరీక్షలు చేయకుండా నిరోధించే ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అధ్యక్షుడు కిమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన శాటిలైట్ ప్రయోగం విఫలం కావడంతో దీన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు, అధికారులు ఇప్పుడు ఎలాంటి శిక్షలు ఎదుర్కొబోతున్నారనేది కీలకంగా మారింది. మామూలు తప్పులకే కిమ్ దారుణమైన శిక్షలు విధిస్తాడు. అలాంటిది ఈ ప్రయోగం విఫలం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సముద్రంలోని రాకెట్ శకలాలను సౌత్ కొరియా స్వాధీనం చేసుకుంది. దీంట్లో ఉత్తర కొరియా ఎలాంటి సాంకేతికతను వాడిందో అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంది.