Earthquake: మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని మెక్సికో అధికారులు తెలిపారు. భూకంపం వల్ల తీర ప్రాంతాల్లోని ఓడరేపుల్లో అలలు ఎగిపడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా వచ్చిన భూకంపం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.
Read Also: Daaku Haseena: 10 రూపాయల ఫ్రూటీ.. రూ. 8 కోట్ల దోపిడీ నిందితుల్ని పట్టించింది.. ఎలాగో తెలుసా..?
భూకంప వచ్చిన కొద్దిసేపటికి బ్రిటీష్ కొలంబియా, అలాస్కాలకు సునామీ ప్రమాదం లేదని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. భూకంప వల్ల సముద్రం నీటి మట్టాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు గుర్తించవచ్చని మెక్సికన్ పౌర రక్షణ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. యూఎస్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 6.3గా గుర్తించింది. గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. 25-30 మిలియన్ ఎళ్లుగా పసిఫిక్, నార్త్ అమెరికన్ పలకాలు క్రమంగా కదలికలకు గురవుుతన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.