Venu Goapl Reddy
Author- NTV Telugu-
RSS: “నో డ్రోన్” జోన్‌గా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం..
RSS: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని ‘ నో డ్రోన్’ జోన్‌గా ప్రకటించారు. అనేక ఉగ్రసంస్థలతో పాటు సంఘవ్యతిరేక శక్తులకు ఆర్ఎస్ఎస్ ప్రధాన టార్గెట్‌గా ఉండటంతో నాగ్‌పూర్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 (1) (3) కింద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
Ayodhya Ram Mandir: 2500 ఏళ్లలో ఒకసారి వచ్చే భారీ భూకంపాన్ని రామ మందిరం తట్టుకుంటుంది..
Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్‌కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్‌తో సహా అనేక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించింది. -
Ram Mandir: వారం రోజుల్లో అయోధ్య రాముడిని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు..
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. -
Nagpur: పెరోల్‌పై వచ్చినా బుద్ధి మారలేదు.. మహిళ, ఆమె మైనర్ కూమార్తెపై అత్యాచారం..
Nagpur: జైలు నుంచి పెరోల్‌పై వచ్చినా కూడా అతని బుద్ధి మారలేదు. ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. ఒక హత్య కేసులో దోషిగా తేలిని వ్యక్తికి ఇటీవల పెరోల్ మంజూరైందని, ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
Sanjay Raut: సీఎం నితీష్ కుమార్ మానసిక స్థితి బాగాలేదు..
Sanjay Raut: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టాడు. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్, ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఆ కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టాయి. -
Hanuman Flag: “హనుమాన్ జెండా”పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు..
Hanuman Flag: కర్ణాటకలో మరో వివాదం చెలరేగింది. మాండ్యా జిల్లాలో అధికారులు హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. జిల్లాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. గ్రామస్తులంతా ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలకు దిగారు. నిన్న ప్రారంభమైన ఈ ఆందోళనలు, ఈ రోజు కూడా కొనసాగించేందు ప్లాన్ చేశారు. -
Pune: “క్యారెక్టర్‌పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్‌ఫ్రెండ్..
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్వాడ్లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్‌ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Iran-Pakistan: ఉద్రిక్తతల నడుమ.. పాక్ వెళ్లిన ఇరాన్ మంత్రి..
Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
Zelensky: అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్స్కీ వార్నింగ్..
Zelensky: రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. ఇరు వర్గాలు కూడా శాంతికి సిద్ధపడటం లేదు. మరోవైపు యుద్ధం కొనసాగించేందుకు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సాయం కోరుతున్నారు. తాజాగా ఆయన జర్మనీ పర్యటనకు వెళ్లారు. అక్కడి స్టేట్ మీడియాతో మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరికలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం గురించి జర్మనీ ఛాన్సలర్ (ఓలాఫ్ స్కోల్జ్) తెలుసుకున్నట్లు నాకు అనిపిస్తోందని ఆయన అన్నారు. -
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. పారిస్ వేదికగా చర్చలు..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!