Ajit Pawar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవల నాందేడ్, ఔరంగాబాద్ సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై అక్కడి పార్టీలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి.
PM Modi US Visit: అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది.
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది.
Shahjahan Bhuiyan: షాజహాన్ భుయాన్(74) బంగ్లాదేశ్ లో పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏకంగా 26 మంది దోషులను, యుద్ధ నేరస్తునలు ఉరితీశాడు. తాజాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. దోపిడి, హత్య నేరాలకు గానూ దాదాపుగా 42 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడు దశాబ్ధాలు జైలులో శిక్ష అనుభవించిన భూయాన్ తాజాగా ఆదివారం విడుదయ్యాడు. ‘ద హాంగ్ మాన్’గా పిలుచుకునే భూయాన్ కు 2001లో జైలు అధికారులు ఉరితీసే ఉద్యోగం ‘తలారి’గా నియమించారు.
Vande Bharat Express: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. కొత్తగా ప్రారంభించిన డెహ్రాడూన్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో
PMKMDY: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఎకరానికి రూ. 6000 లను కేంద్రం అందిస్తోంది.
Hardeep Singh Nijjar: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత కొంతకాలంగా కోరుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. కెనడాలో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రే ప్రాంతంలో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద కాల్చి చంపబడ్డాడు.
Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఆదివారం శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు ముంబైలోని పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు.