టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్ క్యామియో రూపంలో అలరించారు. వారికీ ఎలివేషన్స్ తో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చాడు నెల్సన్.
Also Read : Akhanda2Thandavam : 14వ రోజు అదరగొట్టిన అఖండ – 2.. బాలయ్య తాండవం
ఇక ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 లో ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నాడు నెల్సన్. జైలర్ 2పై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ చేయాల్సి ఉండగా అనుకొని కారణాల వలన ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడట. అతడే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. గతంలో షారుక్ నటించిన రావన్ సినిమాలో రజినీ కాంత్ స్పెషల్ క్యామియోలోకనిపించారు. ఇప్పుడు రజనీ కాంత్ సినిమాలో షారుక్ కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ నాటుడు మిథున్ చక్రవర్తి కన్ఫమ్ చేశారు. దాంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.