Delhi: ఇది మామూలు ట్విస్ట్ కాదు.. ఏకంగా పెళ్లి జరిగిన తర్వాతి రోజు నవవధువు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి షాక్ తినడం వరుడి వంతైంది. పెళ్లి కూతురు బంధువులు అంతా కలిసి పెళ్లి కొడుకును మోసం చేశారు. తమ కుమార్తె గర్భవతి అనే విషయాన్ని దాచి పెట్టి వివాహం జరిపించారు. తీరా తెల్లారేసరికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు మన సికింద్రాబాద్ తో సంబంధం ఉంది.
UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది.
Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది.
PM Modi: కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య జూలై 3న కేంద్రమండ్రి మండలి సమావేశం కానుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది.
Morning sickness: సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలకు వాంతులు వికారం ఉంటుంది. ఇది చాలా సాధారణం. దీన్ని ‘మార్నింగ్ సిక్నెస్’ అని పిలుస్తారు. అయితే అరుదైన సందర్భాల్లో కొందరు మహిళలకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది.
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో కొన్ని వివాదాల్లో ఆయన ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సారి ‘పెన్ను’ వివాదంలో రిషి సునాక్ చిక్కుకున్నారు. ఇప్పటికే అక్కడి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టలేక రిషి సునాక్ విమర్శల పాలవుతున్నారు. ఆయన ఉపయోగిస్తున్న పెన్ను ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఎరేజబుల్ ఇంక్‌తో ఉన్న పెన్నును రిషి సునాక్ వాడటం ప్రస్తుత వివాదానికి కారణమైంది.