Morning sickness: సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలకు వాంతులు వికారం ఉంటుంది. ఇది చాలా సాధారణం. దీన్ని ‘మార్నింగ్ సిక్‌నెస్’ అని పిలుస్తారు. అయితే అరుదైన సందర్భాల్లో కొందరు మహిళలకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. తాజాగా యూకేలోని ఓ మహిళ గర్భధారణ సమయంలో విపరీతమైన వాంతులు చేసుకోవడంతో ఆమె మొత్తం దంతాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లూయిస్ కూపర్ అనే మహిళ 2017లో ఫ్రాన్స్‌లోని ఒక స్కీ రిసార్ట్‌లో నానీగా పనిచేస్తున్నప్పుడు మొదటిసారిగా గర్భం దాల్చింది. అయితే ఆమె గర్భం దాల్చిన వారం లోపే ఆమె అనారోగ్యంతో యూకేకి తిరిగి వెళ్లింది. అప్పుడు ఆమెకు హైపెరెమెసిస్ గ్రావిడరమ్(HG), మార్నింగ్ సిక్నెస్ యెక్క అరుదైన, విపరీతమైన ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 1 శాతం స్త్రీలను ప్రభావితం చేస్తుంది. ఆమె తరుచుగా వాంతులు చేసుకోవడంతో ఆమె దంతాలు ఊడిపోవడం ప్రారంభమైంది. నవంబర్ 2017లో మొదటిసారిగా ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఆరు నెలలకు ఆమె వాంతుల కారణంగా వచ్చిన యాసిడిటీ కారణంగా ఆమె దంతాలన్నింటిని తీసేయాల్సి వచ్చింది.
Read Also: Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించాలి… ఢిల్లీ పోలీసులు
ఆమె ప్రసవించిన తర్వాత వాంతులు, వికారానికి సంబంధించిన లక్షణాలు ఆగిపోయాయి. ఆ తరువాత కూపర్ మరో ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. ఈ రెండుసార్లు కూడా ఆమె HGతో బాధపడింది. ఇది చాలా బాధకరమైనది అని.. మానసికంగా, శారీరకం క్షీణించానని కూపర్ చెప్పింది. ఇప్పుడు దంతాలు లేకుండా బతకడం నేర్చుకున్నానని.. ప్రస్తుతం జీవితం బాగానే ఉందని, సాధారణ స్థితికి చేరుకుందని ఆమె తెలిపారు. దంతాలు లేకపోవడంతో తన ఆహార పద్దతులను మార్చుకున్నట్లు ఆమె తెలిపింది. మాంసం తగ్గించి, ఎక్కువగా కూరగాయలు తింటున్నానని కూపర్ వెల్లడించారు.