Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Modi: “కాంగ్రెస్ 40 సీట్లు దాటదు”.. రాజ్యసభలో పీఎం మోడీ విమర్శలు..
PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు. -
Donald Trump: ట్రంప్‌కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..
Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు. -
USA: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..చికాగోలో ఘటన..
USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఈ దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. -
UPI Outage:: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం, అనేక బ్యాంక్ సర్వర్లు డౌన్..?
UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి. -
Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉరిశిక్ష తప్పదా.? పాక్ ఆర్మీ చట్టాలు ఏం చెబుతున్నాయి.?
Imran Khan: పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నా్యి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భయపెడుతున్నారు. -
Ajit Pawar: శరద్ పవార్‌కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్‌దే..
Ajit Pawar: కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. -
Supreme Court: “పెళ్లి చేసుకోండి లేదా దత్తత తీసుకోండి.. వివాహ పవిత్రత మాకు ముఖ్యం”.. సరోగసీ కేసులో సుప్రీంకోర్టు..
Supreme Court: సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. 44 ఏళ్ల అవివాహిత మహిళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పాశ్చాత్య దేశాల వలే వివాహం కాకుండా పిల్లలు కనడంలా కాకుండా, వివాహ పవిత్రతను కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో సరోగసీ ద్వారా తల్లికావడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. -
Chhattisgarh: “మోడీ సార్ నా భార్యను మీరే కాపాడాలి”.. ఒమన్‌లో చిత్రహింసలకు గురవుతున్న భారతీయ మహిళ..
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ… -
Anti-cheating bill: “పేపర్ లీక్” నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
Anti-cheating bill: ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పరీక్షా పత్రాల లీక్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ చీటింగ్ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు’’ తదుపరి రాజ్యసభ ఆమోదం కోసం వెళ్లింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారనుంది. -
Terrorist arrest: లష్కర్ ఉగ్రవాదిగా మారిన ఆర్మీ జవాన్ అరెస్ట్..
Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!