Uniform Civil Code: కేంద్రం ఈ పార్లమెంటరీ సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లు ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈరోజు సమావేశం కానుంది.
The age of consent: మధ్యప్రదేశ్ హైకోర్టు మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల సెక్స్ సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చాలా క్రిమినల్ కేసుల్లో యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జ్ ధర్మాసన వ్యాఖ్యానించింది.
Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్‌లు, అవినీతి పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే,
Pakistan: పాకిస్తాన్ దేశం బలూచిస్తాన్ ప్రావిన్సులోని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈద్ ఉల్ అదా(బక్రీద్) పండగ సమయంలో వీరంతా పక్కా ప్లాన్ తో జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటన బలూచిస్తాన్ లోని చమన్ జైలులో జరిగింది.
Rajasthan: పాములు పగబడుతాయనే మూఢనమ్మకం మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే పాములు పగబట్టడం అనేది ట్రాష్ అని హేతువాదులు కొట్టిపారేస్తారు. అయితే కొన్నిసార్లు జరిగే సంఘటలను చూస్తే మాత్రం పాములు నిజంగా పగబడతాయా..? అనే సందేహం వస్తుంది. అలాంటి ఘటనే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
PM Modi: ఉక్రెయిన్ యుద్ధం, సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు గురించి ఇరువురు నేతలు సంభాషించారు. ఏ రకంగా తిరుబాటును పరిష్కరించారే వివరాలను పుతిన్, మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
Alef Model A: ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే కారు ప్రయాణానికి సిద్ధం అవుతోంది. ‘అలెఫ్ మోడల్ ఏ’ ఫ్లైయింగ్ కార్ కి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Benjamin Mendy: మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ ఆటగాడు బెంజమిన్ మెండీ 10,000 మంది మహిళలతో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అక్టోబర్ 2020లో చెషైర్ లోని మెట్రామ్ సెయింట్ ఆండ్రూలోని తన భవనంలో 24 ఏళ్ల వయసు ఉన్న యువతిపై 28 ఏళ్ల బెంజమిన్ మెండీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Titan: టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.