Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు… ఆ రాజు గారి పెళ్లి సందడి జోరు మామూలుగా లేదు. ఇంతకీ ఆ రోజు ఎవరో తెలుసా.. నవీన్ పొలిశెట్టినే. ఆయన హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ఈ రోజు మేకర్స్ ‘రాజు గారి పెళ్లి రో’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో ఎనర్జిటిక్‌గా పాడి ఆకట్టుకోగా, మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. అలాగే ఈ పాటలో పెళ్లి సందడి, సంబరాలు, రాజు గారి స్టైల్‌లో నవీన్ పొలిశెట్టి చేసిన హంగామా అన్నీ కలిసి పెళ్లి జోష్‌ను పెంచేసింది.
READ ALSO: Cancer Research: కప్ప ప్రేగులోని బాక్టీరియాతో క్యాన్సర్‌కు చెక్..! ఎలుకలపై ప్రయోగం సక్సెస్..
ఈ సినిమాకు మారి డైరెక్టర్ కాగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో కలిసి మీనాక్షి చౌదరి నటిస్తుంది. గతంలో రిలీజ్ అయిన పాటతో పాటు, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాట సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోందనడంలో సందేహం లేదు. 2026 సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Naga Vamsi: నా క్రష్ ఆ హీరోయినే.. ఓపెన్ అయిన ప్రొడ్యూసర్ నాగవంశీ