TTD Parakamani Theft Case: పరకామణి కేసులో కీలక పరిణామం.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు..
- టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి హైకోర్టు కీలక సూచనలు..
- కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా..
- విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం..
- ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి కీలక సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న ఏపీ హైకోర్టు.. ఈ కేసులో సీఐడీ ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.. కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా.. విడిగా FIR నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
Read Also: Cancer Research: కప్ప ప్రేగులోని బాక్టీరియాతో క్యాన్సర్‌కు చెక్..! ఎలుకలపై ప్రయోగం సక్సెస్..
Also Read
మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కీలక విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై CID ఇప్పటికే దర్యాప్తు నివేదికను సమర్పించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. కోర్టు CID నివేదికను పరిశీలించిన అనంతరం, కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ఈ కేసులో వేర్వేరు కోణాలు, విభిన్న ఆరోపణలు ఉన్నందున, వాటిని విడివిడిగా పరిశీలించి.. అవసరమైతే ప్రత్యేకంగా FIRలు నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులోని భిన్న అంశాలపై విడిగా FIR నమోదు చేసే అవకాశాన్ని పరిశీలించాలి అని CIDకి సూచించింది.. ప్రస్తుత దర్యాప్తు సరైన దిశలో ఉన్నా.. ఇంకా పూర్తిస్థాయి విచారణ అవసరం అని పేర్కొంది.. ఆస్తుల లావాదేవీలతో పాటు ఇతర సంబంధిత అంశాలను లోతుగా పరిశీలించాలి ఆదేశించింది.. ఈ ట్విస్ట్‌లతో TTD పరకామణి కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు నివేదికలు, FIR నమోదు ప్రక్రియలు తదుపరి విచారణలో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!