Bride gives birth after wedding: ఇది మామూలు ట్విస్ట్ కాదు.. ఏకంగా పెళ్లి జరిగిన తర్వాతి రోజు నవవధువు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి షాక్ తినడం వరుడి వంతైంది. పెళ్లి కూతురు బంధువులు అంతా కలిసి పెళ్లి కొడుకును మోసం చేశారు. తమ కుమార్తె గర్భవతి అనే విషయాన్ని దాచి పెట్టి వివాహం జరిపించారు. తీరా తెల్లారేసరికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు మన సికింద్రాబాద్ తో సంబంధం ఉంది.
Read Also: Out Of Danger: నిలకడగా శేజల్ ఆరోగ్యం.. ఔట్ ఆఫ్ డేంజర్ అంటున్న వైద్యులు..!
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి రోజు రాత్రి వధువకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చెప్పిన విషయం తెలిసి వరుదు కంగుతిన్నాడు. వైద్యులు వధువు ఏడు నెలల గర్భిణి అని చెప్పారు. కొత్తగా పెళ్లైన మహిళ తర్వాతి రోజే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
వధువు కుటుంబానికి ఆమె గర్భం గురించి అంతకుముందే తెలుసు అయితే.. ఈ విషయాన్ని వరుడు, అతని తరుపు బంధువుల దగ్గర దాచి పెట్టారు. జూన్ 26న సోమవారం పెళ్లి జరిగింది. అయితే పొట్ట పెద్దగా ఉందని అనుమానించినప్పటికీ.. తన కూతురుకు ఇటీవల రాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగిందని.. అందుకే కడుపు కాస్త లావుగా ఉందని వధువు బంధువులు వరుడి బంధువులకు తెలిపారు. పెళ్లి తర్వాత రోజు వధువు బిడ్డకు జన్మనివ్వడం చూసి అంతా షాక్ తిన్నారు. దీనిపై ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పెళ్లి కూతురు బంధువులకు సమాచారం అందించగా.. వారు సికింద్రాబాద్ నుంచి వచ్చారు. భర్త, అత్తామామలు అంగీకరించకపోవడంతో పాపను, వారి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిందని దన్‌కౌర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు.