BRS: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేశారు. ఇటీవల నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ ఇతర తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు, సభలకు ఎక్కువ మంది తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్…
DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టును కొనసాగించడానికి భయపడ్డాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వంలో దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.
Srilanka: చైనాతో తమకు ఎలాంటి సైనిక ఒప్పందాలు లేవని శ్రీలంక తటస్థంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేఖంగా ఎప్పటికీ వాడుకోనివ్వం అని ఆయన స్పష్టం చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Law Commission: గత కొంత కాలంగా దేశద్రోహ చట్టం(sedition) చట్టం తొలగింపు, అమలుపై కీలక చర్చ జరుగుతోంది. దేహ్రద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నుంచి కేరళ, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత, సమగ్రతను రక్షించేందుకు దేశద్రోహ చట్టం కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
Mamata Banerjee: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ..
Smartphone into TV remote: సాధారణంగా మనం ప్రతీ ఇంట్లో ప్రతీసారి టీవీ రిమోట్ కోసం తీవ్రంగా వెతికే ఉంటాము. ఒక్కోసారి రిమోట్ మనకు పెద్ద పరీక్షనే పెడుతుంది.
Titan tragedy: టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో ముగినిపోయిన 1500 మంది మరణాలకు కారణమైన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోషన్’ అనే దృగ్విషయం కారణంగా పేలిపోయింది.
Asadudiin Owaisi: భారతదేశంలో వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఓ సమస్యగా భావిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భోపాల్ లో ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్ (యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.