PM Modi: కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య జూలై 3న కేంద్రమండ్రి మండలి సమావేశం కానుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సెప్టెంబరులో జి20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 3న సమావేశం జరిగే అవకాశం ఉంది. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో మోడీ వరసగా సమావేశాలు నిర్వహించారు.
Read Also: Morning sickness: గర్భధారణ సమయంలో అరుదైన ఆరోగ్య పరిస్థితి.. దంతాలన్నింటిని కోల్పోయిన మహిళ
ఈ ఏడాది చివర్లో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పాటు వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వరసగా కీలక భేటీలను నిర్వహిస్తోంది. కొన్ని రోజులుగా అమిత్ షా, నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంస్థాగత, రాజకీయ అంశాలపై అనేక సార్లు చర్చించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ భేటీ జరగబోతోంది.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. దీనికి కొన్ని రోజలు ముందు మంత్రిమండలి సమావేశం జరగబోతోంది.