Venu Goapl Reddy
Author- NTV Telugu-
INDIA bloc: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఆప్.. పంజాబ్‌లో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటన..
INDIA bloc: ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ కూటమి ఉంటుందా.? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జతకట్టాడు. ఇది ఇండియా కూటమిని… -
AIIMS: 9 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తుల్లో “కుట్టు సూది”.. తొలగించిన ఎయిమ్స్ వైద్యులు..
AIIMS: భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు కీలక ఆపరేషన్ నిర్వహించి 9 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. ఉపిరితిత్తుల్లో ‘‘కుట్టు సూది’’ని తొలగించి అతడిని కాపాడినట్లు శుక్రవారం ఎయిమ్స్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ విభాగం ఎలాంటి ఓపెన్ సర్జరీ చేయకుండా బ్రొంకోస్కోపిక్ ద్వారా కుట్టు సూదిని తొలగించినట్లు, ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు. -
Yogi Adityanath: “సీఎం యోగి బెంగాల్ వస్తే”.. టీఎంసీ నేత హెచ్చరిక..
Yogi Adityanath: జ్ఞానవాపి మసీదు వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వారణాసి కోర్టు జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై పలువురు ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి వార్నింగ్ ఇస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Asaduddin Owaisi: దేశానికి మోడీ బాబా అవసరం లేదు.. పార్లమెంట్లో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Amit Shah: ఎన్నికల ముందే సీఏఏ అమలు.. అమిత్ షా సంచలన ప్రకటన..
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని… -
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రుల కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. -
Supriya Sule: ఫోన్‌పే, గూగుల్‌పే పేలబోయే “టైమ్ బాంబులు”.. పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు..
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
Pakistan Elections: “నేనే గెలిచాను”.. నవాజ్ షరీఫ్ ప్రకటన..
Pakistan Elections: దక్షిణాసియాలో చర్చనీయాంశంగా పాకిస్తాన్ ఎన్నికలు మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం ఆ దేశంలో పోలింగ్ జరగ్గా, నిన్న సాయంత్రం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. 24 గంటలు దాటిని ఇంకా దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఏ పార్టీ గెలుచిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
National creators’ awards: ఇన్ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లకు “నేషనల్ క్రియేటర్ అవార్డ్స్”.. కేంద్రం ప్లాన్.?
National creators' awards: ప్రస్తుత జనరేషన్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫారామ్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
Recession In Tech: “మాంద్యం” గురించి మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేశారు భయ్యా.. ఓ టెక్కీ ఆవేదన..
Recession In Tech: ఏడాది కాలంగా టెక్ రంగం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివి వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం భయంలో ఖర్చులను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు దీనికి ప్రభావితమయ్యారు. ద్యోగాల కోతలను ట్రాక్ చేస్తున్న స్టార్ట్-అప్ Layoffs.fyi ప్రకారం ఇప్పటివరకు, 2024లో దాదాపు 32,000 మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!