Venu Goapl Reddy
Author- NTV Telugu-
Tower Semiconductor: భారత్‌లో ఇజ్రాయిల్ “సెమీకండక్టర్” కంపెనీ ప్లాంట్.. 8 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక..
Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
Pakistan Elections: ముగిసిన ఓట్ల లెక్కింపు.. “బ్యాట్” లేకున్నా సెంచరీ కొట్టిన ఇమ్రాన్ ఖాన్.. సంకీర్ణ ప్రభుత్వమే..
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 266 జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు పూర్తైంది. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI)కి చెందిన నేతలు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన ‘‘పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్’’, బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్… -
Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాల సాకుతో 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం..
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు. -
PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..
PM MODI: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?
GPS-Based Toll: వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇక ఎదురుచూసే ఇబ్బందులు తప్పబోతున్నాయి. స్మూల్ డ్రైవింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రయాణించేలా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది. ప్రస్తుతం దేశంలోని హైవే టోల్ ప్లాజాల స్థానంలో GPS-ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ విధానం తసీుకువచ్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమించిందని గడ్కరీ గురువారం తెలిపారు. -
Russia: భారత్‌ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..
Russia: భారత్‌ని తమ నుంచి దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా ఆరోపించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోల్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది. -
A Rare Heist: ఇదెక్కడి దొంగతనం.. ల్యాప్‌టాప్, టీవీల కోసం 133 టన్నుల చికెన్ దొంగిలించారు..
A Rare Heist: ఆర్థిక సంక్షోభం, పేదరికం, నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న క్యూబా దేశంలో అరుదైన దొంగతనం జరిగింది. ఆహార కొరత ఉన్న ఆ దేశంలో దొంగలు ఏకంగా 133 టన్నుల చికెన్ దొంగలించారు. దీనంతటిని విక్రయించి వచ్చిన డబ్బుతో ల్యాప్‌టాప్, టీవీలు, రిఫ్రిజ్‌రేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ దొంగతనంలో 30 మందిపై అభియోగాలు మోపారు. దేశ రాజధాని హవానాలో ఈ దొంగతనం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
Shiv Sena MLA: “మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
Shiv Sena MLA: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే మీరు రెండు రోజుల పాటు తినొద్దని కోరడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
Pakistan Elections: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు..
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో… -
Acharya Pramod: కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ బహిష్కరణ.. ‘‘రాముడి విషయంలో రాజీ లేదని రిఫ్లై‘‘
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!