Yogi Adityanath: ఫ్రాన్స్ అల్లర్లు అదుపులోకి రావాలంటే “యోగి”నే కరెక్ట్.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఫ్రాన్స్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని పారిస్ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంపై అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పారిస్ నగరంలో పలు ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు లూటీలకు పాల్పడుతున్నారు. పారిస్ నగర మేయర్ ఇంటిపై కూడా దాడికి తెగబడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం ఆ ట్వీట్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ముడిపడి ఉండటమే.
Read Also: Kia Seltos: మళ్లీ కనిపించిన కొత్త సెల్టోస్ మ్యాజిక్.. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అదుర్స్..!
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
‘యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపండి’ 24 గంటల్లో ఫ్రాన్స్ అల్లర్లు అదుపులోకి వస్తాయని శుక్రవారం, ప్రొఫెసర్ ఎన్ జాన్ కామ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కనిపించింది. ‘‘అక్కడి అల్లర్ల పరిస్థితిని నియంత్రించడానికి భారతదేశం యోగి ఆదిత్యనాథ్ ను ఫ్రాన్స్ కి పంపాలి’’ అంటూ జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ పై సీఎం ఆఫీస్ స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. యూపీలో నేరస్తులపై ఉక్కుపాదం మోపే యోగి మోడల్ ని అనుసరించాలి. దాంతో అల్లర్లు కట్టడి చేయవచ్చని..సీఎం యోగి ఆఫీస్ ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చీటింగ్ కేసులో అరెస్టైన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ కు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ అని ఆరోపిస్తున్నారు. తప్పుడు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధానం అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. నకిలీ ట్వీట్లతో సంతోషిస్తున్నారని.. మేము లఖీంపూర్ ఖేరీ, హత్రాస్ లో యోగి మోడల్ ని చూశామని విమర్శించారు. విదేశీ ప్రశంసల కోసం బీజేపీ ఆరాటపడుతోందని విమర్శించారు.
Whenever extremism fuels riots, chaos engulfs and law & order situation arises in any part of the globe, the World seeks solace and yearns for the transformative "Yogi Model" of Law & Order established by Maharaj Ji in Uttar Pradesh. https://t.co/xyFxd1YBpi
— Yogi Adityanath Office (@myogioffice) July 1, 2023
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!