Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుంచి పూణే వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది సజీవదహనమయ్యారు.
Manipur CM: మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామాకు సిద్దమయ్యారు. రాజధాని ఇంఫాల్ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాజీనామాను గవర్నర్ కి సమర్పించేందుకు రాజ్ భవన్ వెళ్లే సందర్భంలో ఆయన మద్దతుదారులు సీఎం ఇంటి ముందు భారీగా చేరుకున్నారు. రాజీనామా చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆన్నారు.
Biryani: బిర్యానీ ఈ పేరు వింటే చాలు నోట్లో లాలాజలం లీకవుతుంది. అంతగా ఈ బిర్యానీకి మన ప్రజలు అలవాటయ్యారు. ఇప్పటికీ మనం రెస్టారెంట్లకు వెళ్తే ముందుగా గుర్తొచ్చే పదం బిర్యానీనే. ఇది లేకుండా ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఫినిష్ కావడం లేదు. జూన్ 2 ‘ఇంటర్నేషనల్ బిర్యానీ డే’ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 7.6 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది.
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Times Now Navbharat Survey: దేశంలో నరేంద్రమోడీ హవా తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
Semiconductor: భారతదేశం పెట్టుబడుకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే పలు సెమికండక్టర్ దిగ్గజ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ రంగంలో చైనా, తైవాన్ నియంతృత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిప్ తయారీకి భారత్ గమ్యస్థానంగా మార్చాలని కేంద్ర భావిస్తోంది. ఇప్పటికే ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ స్పష్టం చేసింది.
Teesta Setalvad: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలను సృష్టించడం, పలువురుని కేసులో ఇరికించేందుకు కుట్ర చేసిన కేసులో ప్రముఖ హక్కుల నేత తీస్తా సెలత్వాడ్ నిందితురాలిగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఆమెను వెంటనే లొంగిపోవాలని, బెయిల్ తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శనివారం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటివరకు ఆమెను అరెస్టు చేయలేదు.