Eknath Shinde: షిండే “ట్రిపుల్ ఇంజన్ సర్కార్” వ్యాఖ్యలు.. గతంలో ఎన్సీపీని వద్దన్న షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తో చేరారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ‘‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’’ ఉందంటూ వ్యాఖ్యానించారు. గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వంలో ఎన్సీపీ చేరితే మేం వైదొలుగుతాం అని ప్రకటించిన ఏక్ నాథ్ షిండే ప్రస్తుతం ఎన్సీపీ ప్రభుత్వంలో చేరడాన్ని స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉందని అన్నారు.
Read Also: Rangabali: పవన్ కళ్యాణ్ ను.. ఓ రేంజ్ లో దింపేశారయ్యా.. సూపర్.. సూపర్ .. సూపర్
Also Read
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ఎన్సీపీ నమ్మకద్రోహం చేసే పార్టీ, మేము అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండము అని షిండే వర్గం నేత, అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఏప్రిల్ 19న విలేకరులతో అన్నారు. బీజేపీతో ఎన్సీపీ చేరితే మహారాష్ట్ర ఇష్టపడదని.. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన వెళ్లడం నచ్చకే ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నటు ఆయన గతంలో వెల్లడించారు. ఒకవేళ అజిత్ పవార్ ఎన్సీపీలో స్వేచ్ఛగా లేకపోతే, అతను ఎన్సీపీని వీడితే మేము స్వాగతిస్తామని.. అతను ఎన్సీపీ నాయకులతో వస్తే మాత్రం మేం ప్రభుత్వంలో ఉండబోమని అన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, ఎన్సీపీ మొత్తం ప్రభుత్వంలో చేరిందని, ఎన్నికల్లో పార్టీ గుర్తుపైనే, ఉమ్మడిగా పోటీ చేస్తామని అన్నారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడంతోనే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశానని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్సీపీ రాకతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒక ముఖ్యమంత్రి ఉన్నారని, ఇది రాష్ట్రాభివృద్ధిని వేగం చేస్తుందని ఏక్ నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?