Venu Goapl Reddy
Author- NTV Telugu-
Valentine Day: ప్రేమ ముసుగులో వేధిస్తే బడితపూజ.. నూనె రాసి ‘లాఠీ పూజ’ చేసిన క్రాంతిసేన..
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ శనివారం వార్నింగ్ ఇచ్చారు. -
Farmers’ protest: రైతులు నిరసన నేపథ్యంలో హర్యానా జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..
Farmers' protest: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి. -
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 28,000 దాటిన మృతుల సంఖ్య..
Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు. -
Amit Shah: రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండదు.. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు..
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు. -
NITI Aayog: నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలో ముంబైతో పాటు వైజాగ్ నగరం.. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం..
NITI Aayog: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేస్తోంది. ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ నగరాల ఆర్థిక పరివర్తణ కోసం ఒక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సాయపడుతుందని నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం తెలిపారు. నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నందున, మరో 20-25 నగరాల ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ యోచిస్తోందని ఆయన… -
PM Modi: ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లు, ఆర్టికల్ 370.. 17వ లోక్‌సభ గొప్ప సంస్కరణలు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పార్లమెంట్లో ప్రసంగిస్తూ..బీజేపీ ప్రభుత్వ విజయాలను గురించి ప్రస్తావించారు. 17వ లోక్‌సభలో కొన్ని తరాలుగా ఎదురుచూసిన విజయాలను సాధించామని ప్రధాని అన్నారు. 17వ లోక్‌సభ చివరి సెషన్ చివరి రోజు ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలో దేశంలో గేమ్ ఛేంజింగ్ సంస్కరణల్ని తెచ్చామని అన్నారు. అనేక తరాలుగా ఏదురుచూస్తున్న ఆర్టికల్ 370ని ఈ లోక్‌సభలో రద్దు చేశామని, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేసినట్లు ప్రధాని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు మన దేశానికి చాలా ముఖ్యమైనవని… -
Pakistan: “మెచ్యురిటీతో వ్యవహరించండి”.. పాక్ పొలిటికల్ పార్టీలకు ఆర్మీ చీఫ్ సూచన..
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బయటకు మాత్రమే కనిపిస్తుంది, లోపల అంతా నడిపేది, నడిపించేది ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ అనేది అందరికి తెలిసిన విషయమే. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు అతడి పార్టీ సింబర్ రద్దు చేసిన సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ పాక్ ముస్లింలీగ్‌కి కానీ, బిలావల్ భుట్టో పార్టీ… -
Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సంకీర్ణం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు..
Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్… -
Madhya Pradesh HC: ఇళ్లు కూల్చడం “ఫ్యాషన్” అయిపోయింది.. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశం..
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Best CMs: సీఎం యోగి పాపులారిటీకి తిరుగులేదు..టాప్-10 బెస్ట్ సీఎంలు వీరే..
Best CMs: దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం…
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!