NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ ఆదివారం బీజేపీ-షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఎన్సీపీ పార్టీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇస్తూ బీజేపీతో చేరారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతో పాటు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా క్యాబినెట్ లో చేరారు. ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే-పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, ధర్మారావు బాబా అత్రమ్, అదితి తత్కరే, సంజయ్ బన్సోడే మరియు అనిల్ పాటిల్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: Sharad Pawar: చింతించడం లేదు.. ఇది కొత్త కాదు.. తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
దీనిపై అజిత్ పవార్ వర్గం మీడియాతో మాట్లాడింది. మొత్తం ఎన్సీపీ అంతా బీజేపీతోనే ఉందని అజిత్ పవార్ స్పష్టం చేశారు. మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ మొత్తం ప్రభుత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియా సమావేశంలో పవార్ చెప్పారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని, పార్టీ పేరు, గుర్తుతోనే పోటీ చేస్తానమని ఆయన ప్రకటించారు. పార్టీలో చీలిక లేదని ఆయన అన్నారు. వచ్చే రెండేళ్లలో మాపై చాలా మంది విమర్శలు గుప్పిస్తారు, ఇవన్నీ పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే మా లక్ష్యం అని అజిత్ పవార్ అన్నారు. మద్దతుకు సంబంధించి చాలా కాలంగా చర్యలు జరుగుతన్నాయని ఆయన అన్నారు.
ఎన్సీపీ నుంచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఛగన్ భుజబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని అవుతారని.. శరద్ పవారే చెప్పారని, సానుకూల సూచనగా అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించున్నట్లు వెల్లడించారు. అందరు ఎమ్మెల్యేలంతా మా వెంటే ఉన్నారని ఆయన అన్నారు.
Maharashtra Minister Chhagan Bhujabal, says "Pawar Saheb himself said that Narendra Modi is coming back as the Prime Minister and as a positive gesture, we have decided to come with this govt for development" pic.twitter.com/dC06IDVbqw
— ANI (@ANI) July 2, 2023