Ajit Pawar: నోరు విప్పిన అజిత్ పవార్.. అందుకే బీజేపీ కూటమిలో చేరాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడి కొడుకు, కీలక నేత అజిత్ పవార్ బీజేపీ-ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వంలో చేరారు. ఓ వైపు శరద్ పవార్, బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గంలో చేరారు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: Mayawati: “యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని.. ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రయత్నంలో పాలుపంచుకోవడానికే ఈ బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. ఈ రోజు ఎన్సీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీలో చేస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
కేంద్రంలో బలమైన నాయకత్వం కావాలి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మహారాష్ట్రలో అభివృద్ధి తన ప్రాధాన్యతన అని విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ చెప్పారు. మొత్తం ఎన్సీపీ బీజేపీతో చేరిందని అజిత్ పవార్ వెల్లడించారు. దేశాన్ని ంముందకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని ఆయన ఆరోపించారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఉంటే 40కి పైగా ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!