Copper Price: బంగారం, వెండి మాత్రమే కాదు.. రాగి ధరలు కూడా రికార్డు స్థాయికి..!
- ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్న రాగి ధరలు..
- అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను రాగి 12000 డాలర్లు..
- ఎంసీఎక్స్‌లో కిలో రూ.1140-రూ.1160 మధ్య ట్రేడ్..
- సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుదల..
- ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో రాగికి డిమాండ్ ..
- 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Copper Price: అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను 12000 డాలర్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలోని MCXలో దాదాపు కిలో రాగి 1140 రూపాయల నుంచి 1160 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. 2025లో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగింది.
Read Also: Off The Record: కర్నూలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. ఆశావహులకు తప్పని నిరాశ..!
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీని వల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ధరలు పెరగడానికి ఇది మరోక కారణం. గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, తక్కువ పెట్టుబడులు, డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. సరఫరా సమస్యల కారణంగా పెట్టుబడిదారులు రాగిని కొనుగోలు చేస్తున్నారు. రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా మూడు రంగాలు కారణమవుతున్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు. సాధారణ పెట్రోల్ కార్ కంటే ఎలక్ట్రిక్ కార్ తయారీలో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో కీలకం. మూడవది, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు. ఈ రంగాల విస్తరణ వల్ల 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపర్ రేట్లు పెరుగుతుండటంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటల్ అయిన కాపర్‌పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.
కాగా, బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. మరోసారి లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది గోల్డ్. ఈ మార్క్‌కు గోల్డ్ రేటు చేసుకోవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. వేలకు వేలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు భారంగా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం ఏకంగా తులం బంగారంపై 770 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగి లక్షా 40వేల 20 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి లక్షా 28వేల 350 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అదే జోరును కొనసాగిస్తున్నాయి. యూఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం పెరిగి ఔన్సు 4,501.44 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మొత్తం మీద బంగారం ధరలు 70 శాతానికి పైగా పెరిగాయి.
వెండి విషయంలో అయితే ధరల పెరుగుదల మరింత వేగంగా సాగుతోంది. వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ వెండి ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. మార్చి వెండి ఫ్యూచర్స్ దాదాపు 4 శాతం పెరిగి కిలోకు 2లక్షల 32వేల 741 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో శుక్రవారం కేజీ ధర ఏకంగా 2 లక్షల 37వేలు పలికింది. 2025 ప్రారంభం నుంచి వెండి ధర దాదాపు 158 శాతం వరకు పెరిగింది. 2025 జనవరి 1న కేజీ వెండి 90,500 పలికింది. సరిగ్గా 2025 డిసెంబర్ 26న కేజీ వెండి ధర 2 లక్షల 37వేలు పలుకుతోంది. దీన్నిబట్టి వెండి ధర ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బంగారాన్ని కూడా మించి వెండిపై రాబడులు రావడం పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచింది. బలమైన పెట్టుబడి డిమాండ్, వెండిని అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చడం, అలాగే మోమెంటమ్ ఆధారిత కొనుగోళ్లు వెండి ధరలకు ప్రధాన బలంగా మారాయి. వెనిజులా నుంచి ముడి చమురు రవాణాను అడ్డుకుంటూ అమెరికా విధించిన ఆంక్షలు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలోని ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, కార్మిక మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం. ఈ కారణాలన్నీ బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
తాజావార్తలు
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!