Mayawati: దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వంటి పార్టీలు దీనికి మద్దతు తెలిపుతున్నాయి. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి కూడా తాను యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అమలు చేస్తున్న పద్ధతే సరిగ్గా లేదని ఆమె ఆరోపించారు.
Read Also: Manikrao Thakre: బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యింది.. మాణిక్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
యూసీసీని బీజేపీ అమలు చేసే విధానాన్ని సమర్థించమని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ సూచిస్తున్నప్పటికీ.. దాన్ని తప్పకుండా విధించాలనే నిబంధన లేదని ఆమె అన్నారు. ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే దీన్ని అమలు చేయాలని ఆమె సూచించారు. అయితే ఇది ఏకాభిప్రాయంతో జరగడం లేదని.. యూసీసీ ముసుగులో సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశానికి ప్రయోజనం కాదని.. ఇప్పుడు అదే జరుగుతోందని ఆమె దుయ్యబలట్టారు. బీఎస్పీ పార్టీ యూసీసీకి వ్యతిరేకం కాదని.. దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న విధానానికి మాత్రమే మేం వ్యతిరేకం అని అన్నారు.
ఇటీవల భోపాల్ సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ.. యూసీసీపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్దారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని సూచించిందని ఆయన అన్నారు. దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా యూసీసీని సమర్దించిందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు పలు ముస్లిం సంఘాలు, సిక్క సంఘాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.