PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, సీమాంత ఉగ్రవాదానిక మద్దతు ఇచ్చే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్ లో సభ్యదేశాలతో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ కడిగిపారేశారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్న సమయంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
మోడీ వ్యాఖ్యలతో బిత్తరపోవడం షహబాజ్ షరీఫ్ వంతైంది. ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్ ఎదుర్కొవడానికి నిర్ణయాత్మకపు చర్యలు తీసుకునే అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ప్రాంతీయంగా, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా వ్యతిరేకించాలని సభ్యదేశాలకు పిలునిచ్చారు. వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారి ప్రపంచానికి సవాల్ గా నిలిచాయని.. అన్ని దేశాలకు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం పెద్ద సవాల్ గా ఉందని.. దీన్ని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా కృష్టి చేయాలని అన్నారు.
ఈ ఏడాది ఎస్‌సీఓ సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ రోజు జరిగిన వర్చువల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ దేశాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ ఆందోళన చెందుతుందని, భారత్ లాగే ఇతర సభ్యదేశాల పరిస్థితి ఉందని ప్రధాని అన్నారు. ఈ కూటమిలో ఇరాన్ కొత్త సభ్యదేశంగా చేరడాన్ని ప్రధాని స్వాగతించారు. బెలారస్ అధ్యక్షుడు సభ్యత్వం కోసం మోమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్ పై సంతకం చేయడాన్ని కూడా ఆయన స్వాగతించారు.
#WATCH | Prime Minister Narendra Modi at the Shanghai Cooperation Organization (SCO), says "Terrorism is a threat to regional and global peace. We will have to fight against terrorism…Some countries use cross-border terrorism as an instrument of their policies and give shelter… pic.twitter.com/qOjYt3Juo5
— ANI (@ANI) July 4, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!