USA: అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.
Mexico Bus Accident: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వత ప్రాంతం గుండా బస్సు వెళ్తున్న సమయంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఒక మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు.
Porn Addiction: ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ సైట్లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు క్రమంగా ఈ పోర్న్ కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇలాగే పోర్న్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
IMD: ఈ ఏడాది జూన్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ సంస్థ( ఐఎండీ ) తెలియజేసింది. గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నెలలో దక్షిణాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. సగటు ఉష్ణోగ్రతను మించి ఈ దక్షిణ
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్‌తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Assam: గౌహతిలో దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై దారుణంగా 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రవేటు భాగాలపై కారం చల్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.