Mobile Games: ప్రస్తుతం మొబైల్ ఫోన్లు మన శరీరంలో ఓ భాగం అనేంతగా మారాయి. ఎల్లప్పుడూ మనం మొబైల్ ఫోన్లను పట్టుకూనే ఉంటున్నాయి. ప్రతీ ఒక్క పని మొబైల్ లో ముడిపడి ఉంది. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం మొబైల్ ఫోన్లలో గేమ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. చెప్పాలంటే ఆ గేమ్స్ కి బానిసలు అవుతున్నారు. ఇలా మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ కావడం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ గేమ్స్ అడిక్షన్ వల్ల 5 రకాల హానికరమైన ప్రభావాల బారిన పడవచ్చని హెచ్చరిస్తున్నారు.
1)ముఖ్యంగా మీ కళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీ కళ్లకు విరామం ఇవ్వకుండా ఎక్కువగా గేమ్స్ ఆడితే.. ‘‘అస్తెనోపియా’’ అనే కంటి జబ్బుకు దారి తీస్తుంది. దీంతో పాటు కంటి, తలనొప్పులు వస్తుంటాయి. నిరంతరం మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కూడా మందగిస్తుంది. ఈ ప్రభావాల నుంచి తప్పించుకోవాంటే కనీసం యాంటీ-గ్లేర్ అద్దాలు వాడటం మంచింది.
2) మీరు గేమ్స్ గంటల కొద్ది ఆడుతూ వాటికి బానిసైతే.. వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. గేమ్స్ మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ.. మీరు ఎదగడానికి మాత్రం సహాయపడదు. వీటికే ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఇతర పనులు కూడా ఆపేస్తుంటారు.
3) కొన్ని సార్లు గేమ్స్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వీటిని డౌన్ లోడ్ చేసేటప్పుడు మాల్వేర్, వైరస్ లబారిన పడే అవకాశం ఉంటుంది. మొబైళ్ల హ్యకింగ్ చేయడం ద్వారా కేటుగాళ్లు డబ్బును కొట్టేసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్బాల్లో గేమ్స్ కోసం మనమే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంటాం. వీటి వల్ల ఆర్థిక నష్టమే తప్పితే ప్రయోజనం ఉండదు.
4) నిరంతరం ఫోన్ల వినియోగం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు ఒకే పొజిషన్ లో గంటల తరబడి ఉంటారు. దీనివల్ల శారీరక రుగ్మతలు వస్తాయి. ఊబకాయం, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాలు సూచించాయి.
5) నిత్యం గేమ్స్ లో పడిపోయి మీ ఫ్యామిలీకి, బంధువులకు సమయం ఇవ్వలేరు. ఇది మీ సోషల్ లైఫ్ ని కూడా ప్రభావితం చేస్తుంది. వ్యక్తుల మధ్య సంబంధాలను దెబ్బతిస్తాయి. కాలక్రమంలో గేమ్స్ కి బానిస అయినవారిని మిగతావారు పట్టించుకోవడం కూడా మానెయొచ్చు.