White House: అమెరికా అధ్యక్ష భవనంలో వైట్‌హౌజ్‌లో అనుమానాస్పదంగా వైట్ పౌడర్ వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఆదివారం సాయంత్రం వైట్ హౌస్ వద్ద అనుమానాస్పద పదార్థాన్ని కనుగొంది. ఈ పదార్థాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో వైట్ హౌజును ఖాళీ చేయించి అధికారులు తనిఖీలు చేపట్టారు. వైట్‌హౌస్‌లోకి తెల్లటి పొడి ఎలా వచ్చిందో అధికారులు అర్థం చేసుకుంటున్నారని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ పేర్కొన్నారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి
ప్రాథమిక పరీక్షల్లో ఈ పౌడర్, కొకైన్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇది ఖచ్చితంగా ఎలాంటి పదార్థమో తెలుసుకునేందుకు పరీక్ష్లు జరుపుతున్నామని ఆంథనీ గుగ్లీల్మీ తెలిపారు. ఈ పదార్థం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లలేదని చెప్పారు. ఆ సమయంలో అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్‌లో లేరని తెలిపారు. ఈ పదార్థం అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ పదార్థాన్ని కనుగొన్నట్లు తెలిసింది.