MG ZS EV ADAS: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ తరువాత ఎక్కువ అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్ యూ వీల్లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ తర్వాతి స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో వినియోగదారులు ఎక్కువగా ADAS( అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టింగ్ సిస్టమ్)తో కోరుకుంటున్న నేపథ్యంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీని అడాస్ ఫీచర్లతో తీసుకువచ్చింది.
Fronx CNG: మారుతి సుజుకి CNG కార్ల విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కార్ మేకర్ నుంచి స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ -ఆర్, ఆల్టో 800, సెలెరియో, ఎకో.ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా కార్లు CNG వెర్షన్ లో లభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాంక్స్ కూడా చేరింది. తాజాగా ఫ్రాంక్స్ CNG వెర్షన్ లాంచ్ చేశారు. మారుతి సుజుకీ నుంచి ఇది 15వ CNG కార్.
BJP: 2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
Nitin Gadkari: ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ గ్యాంగ్స్టర్ హత్య జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు భద్రత నడుమ తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది పోలీసులు కళ్లలో కారం కొట్టి గ్యాంగ్స్టర్ ని కాల్చి చంపారు. బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే హత్య కేసులో నిందితులుగా ఉన్న కల్దీప్ జఘీనా, విజయపాల్ అనే ఇద్దరు నిందితులను ఏడుగురు పోలీసులు బస్సులో జైపూర్ నుంచి భరత పూర్ తీసుకెళ్లుతున్న సమయంలో 8 మంది వ్యక్తులు బస్సును అడ్డగించి,
Titan Tragedy: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ సముద్రం లోపలికి వెళ్లి పేలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సమయంలో టైటాన్ లో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు.
Delhi Floods: ఢిల్లీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు యయునా నది మహోగ్ర రూపం దాల్చింది. 1978 తర్వాత రికార్డు స్థాయిలో 207.49 మీటర్ల గరిష్ట నీటిమట్టానికి యమునా నది చేరింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయాలని ప్రజలను సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
Lose Eyesight: రాజస్థాన్ రాష్ట్రంలో 18 మంది కంటి చూపును కోల్పోయారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత ఈ 18 మంది కంటి చూపును కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.