BJP: ఆ స్థానాలు, 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్.. నడ్డా నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి సమాలోచన చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన 160 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేయడంపై చర్చించారు. బీజేపీ రూపొందించిన “లోక్ సభ ప్రవాస్” కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: WI vs IND: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్.. కీపర్ గా ఇషాన్ కిషన్
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నిలుపుకోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోని రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇక తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల పరాజయం తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని కృతనిశ్చయంతో బీజేపీ ఉంది.
అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, పూర్తి సామర్ధ్యం తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే విజయం ద్వారా రానున్న సార్వత్రిక లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే చాలా కీలకమని ప్రస్తుతం బీజేపీ భావిస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!