Fronx CNG: మారుతి సుజుకి CNG కార్ల విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కార్ మేకర్ నుంచి స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ -ఆర్, ఆల్టో 800, సెలెరియో, ఎకో.ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా కార్లు CNG వెర్షన్ లో లభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాంక్స్ కూడా చేరింది. తాజాగా ఫ్రాంక్స్ CNG వెర్షన్ లాంచ్ చేశారు. మారుతి సుజుకీ నుంచి ఇది 15వ CNG కార్. కొత్తగా వచ్చిన ఫ్రాంక్స్ ధర రూ. 8.41(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. కేవలం రెండు వేరియంట్లలోనే ఈ ఫ్రాంక్స్ CNG కార్ వస్తుంది.
Read Also: Madhu Yaskhi Goud: బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఆ నిధులు ఎక్కడివి? ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
2010లో మారుతి సుజుకీ సీఎన్జీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 1.4 మిలియన్ కంటే ఎక్కువ సీఎన్జీ కార్లను విక్రయించింది. సుమారుగా 1.44 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడినట్లు మారుతి సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సీఎన్జీ ప్యాసింజర్ వాహనాల్లో 26 శాతం మారుతి సుజుకి వాహనాలే ఉన్నాయి.
ఫ్రాంక్స్ CNG 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడ్‌లో, ఈ ఇంజన్ గరిష్టంగా 89.73 పీఎస్ పవర్, 113ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే CNG మోడ్‌లో 77.5 పీఎస్, 98.5 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రాంక్స్ CNG వెర్షన్ లో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం లేదు. 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఏకంగా కేజీ సీఎన్జీకి 28.51 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సిగ్మా, డెల్టా వేరియంట్లలో ఫ్రాంక్స్ లభ్యమవుతుంది. సిగ్మా ధర రూ. 8.41 లక్షలు(ఎక్స్-షోరూం), డెల్టా ధర రూ. 9.27 (ఎక్స్-షోరూం)గా ఉంది.