Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Microsoft: టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది.
Madras High Court: లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది.
CRPS: కాలు కదిపినా నొప్పే, కాలికి ఏదైనా వస్తువు మామూలుగా తాకినా చచ్చేంద బాధ, చివకు ఎవరైనా పట్టుకున్నా కూడా చెప్పలేనంత బాధ అనుభవిస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పదేళ్ల బాలిక.
China: చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తలలో పేను గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ చైనాలో మాత్రం ఓ బాలుడికి పేను వేరే చోటును ఎంచుకుంది. ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకన్నట్లు వైద్యులు గుర్తించారు.
Jammu Kashmir: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.