Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Manchu Manoj: తాండూరు ఎమ్మెల్యే అతిరుద్ర మహాయాగంలో మెరిసిన మంచు మనోజ్ దంపతులు
హరియానాలో కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పరిస్థితులు తలెత్తాయి. ఏకంగా రాష్ట్ర మంత్రి ఇంట్లోకి వరద నీరు చేరుకోవడం అక్కడి పరిస్థితికి అద్దపడుతోంది. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఇంట్లోకి వరద నీరు చేరిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంబాలాలోని మంత్రి ఇంట్లోకి మోకాలిలోతు నీరు చేరింది. అంబాలాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఇంతటి నీటిలోనూ హోంమంత్రి అనిల్ విజ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి విధులు నిర్వర్తించారు. అంబాలా నగరం అంతటా పర్యటించి వరద పరిస్థితులను సమీక్షించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే హర్యానాలో భారీ వర్షాల కారణంగా 10 మంది మరణించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ పరిహారాన్ని ప్రకటించారు.
#WATCH | Haryana Home Minister Anil Vij's residence in Ambala flooded following incessant rainfall in the state. pic.twitter.com/N815lda0Ex
— ANI (@ANI) July 12, 2023